ఆకేరు న్యూస్, డెస్క్ : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Vice President of India Jagdeep Dhankhar) ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారు జామున ఎయిమ్స్‌లో చేర్పించారు. కార్డియాక్ (Cardiac) విభాగంలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ (AIMS) వైద్యులు చెబుతున్నారు. ఆయన పరీక్షలు చేస్తున్నారు. నివేదికలు వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉంటే ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
……………………………………..
