
* హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
* గూడూరు సమీపంలో విరిగిన రైలుపట్టాలు
* రెడ్ క్లాత్ ద్వారా అప్రమత్తం చేసిన స్థానికుడు
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుపతి పరిధి గూడూరు రైల్వే జంక్షన్లో హౌరా ఎక్స్ ప్రెస్ (Howra Express) కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు అడవయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి. పట్టాలు విరిగిన విషయాన్ని గమనించి లోకో పైలట్‌ను స్థానికుడొకరు అప్రమత్తం చేశారు. రెడ్ క్లాత్ (Redcloth)ద్వారా సునీల్ అనే యువకుడు లోకో పైలట్(locopilot)ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అది గుర్తించిన పైలట్‌ను రైలు నిలిపివేశారు. అయితే, దీనివల్ల సుమారు గంటపాలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టాలు సరిచేసి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
………………………………………