
రోదిస్తున్న SLBC టన్నెల్ బాధిత కుటుంబ సభ్యులు
* టన్నెల్ వద్ద మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష
* గుండలవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్ ఎల్బీసీ టన్నెల్ వద్ద మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uthamkumar reddy), జూపల్లి (Jupalli) సమావేశమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎస్ శాంతికుమారి( CS Shanthikumari), స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ (Arvindhkumar) కూడా సమీక్షలో పాల్గొన్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)తో మృతదేహాలు లాంటివి శుక్రవారం గుర్తించారు. ఈక్రమంలో ఈరోజు ఉదయమే మంత్రులు, ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. ఘటన జరిగిన తీరు, అక్కడి పరిస్థితులను చూస్తే ఆ 8 మంది చనిపోయినట్లేనన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ధ్రువీకరించడానికి స్పష్టమైన ఆధారాలు దొరక్కపోవడంతో ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. చనిపోయారన్న ప్రచారం నేపథ్యంలో ఆయా కార్మికులు, ఇంజనీర్లకు చెందిన కుటుంబాలు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. తమ వారి కోసం గుండెలవిసేలా కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.
—————