YSRCP Protest
* వైసీపీ ధర్నాకు బ్రేక్?
ఆకేరు న్యూస్, విజయవాడ : వైసీపీ చేపట్టనున్న ఆందోళన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ శాప్ కార్యాలయం ముందు ధర్నాకు వైసీపీ సిద్ధమైంది. అయితే వైసీపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, పేర్ని నానికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడకు వచ్చే ప్రధాన మార్గాలు, కూడళ్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే తాడేపల్లి వద్ద ప్రత్యేకంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
మరోవైపు శాప్ కార్యాలయానికి వెళ్లే మార్గాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్యాలయానికి మూడు వైపులా భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ధర్నా, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
