* వైరల్ వీడియో అదుర్స్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆ కొట్లాట.. శునకాలు.. శునకాల మధ్య కాదు.. శునకాలు(Dods).. సింహాల(Lions) మధ్య. అవును.. మీరు చదువుతోంది నిజమే. ఓ రెండు శునకాలు, సింహాల మధ్య ఘర్షణ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్మీడియా(Social Media)ప్రియులను ఆకట్టుకుంటోంది. ఓ గ్రామంలోకి వచ్చిన రెండు సింహాలతో గ్రామ సింహాలు ఘర్షణ పడ్డాయి. మా ఊరిలోకే వస్తావా.. అంటూ సింహాలతో గొడవకు దిగుతున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఈ ఘటన గుజరాత్(Gujarath)లోని అమ్రేలీ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. గోవుల షెడ్డు లోపలికి ఎంట్రీ ఇచ్చేందుకు సింహాలు ప్రయత్నించాయి. కానీ గేటుకు మరో వైపు ఉన్న రెండు కుక్కలు అరుస్తూ ఆ సింహాలను అడ్డుకున్నాయి. నాలుగు జంతువులూ అరుస్తూ.. గేటును అటూ ఇటూ ఊపేశాయి. ఐరన్ గేటు బలంగా ఉండడం వల్ల శునకాలు సేఫ్గా ఉన్నాయి. కాసేపటి తర్వాత సమీపంలో ఉన్న పొదల్లోకి సింహాలు పారియాయి. రిజర్వ్ ఫారెస్ట్(Reserve Forest)ఏరియా నుంచి సింహాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన రాలేదు.
———————————————–