
Virar building collapse, Death toll rises
* ఇప్పటికి బయట పడ్డ 17 మృతదేహాలు
* మరి కొన్ని మృతదేహాలు ఉన్నట్లు అనుమానం
* శిథిలాలను తొలగిస్తున్న అధికారులు
* అక్రమ నిర్మాణం అని ధృదీకరించిన అధికారులు
* పోలీసుల అదుపులో బిల్డర్, ల్యాండ్ ఓనర్
ఆకేరు న్యూస్ డెస్క్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా విరార్ లో విషాదం చోటు చేసుకుంది. నాలుగంతుస్థుల భవనం కూలి పక్కనే ఉన్న ఇళ్లపై పడింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి… విరార్ ప్రాంతంలో రమాబాయి అపార్ట్ మెంట్…కుప్పకూలింది. సమాచారం అందడంతో సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని…సహాయక చర్యలు చేపట్టాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదుతో…పోలీసులు భవన నిర్మాణదారుడిని అరెస్టు చేశారు. కూలిన భవనం సమీపంలో ఉన్న ఇళ్లలోని ప్రజల్ని… సురక్షిత ప్రాంతాలకు తరలించారుఅధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం 50 ప్లాట్లు ఉన్నాయి. వాటిలో కూలిపోయిన భాగంలో 12 ఫ్లాట్లు ఉన్నాయి అయితే ఇది అక్రమ కట్టడం అని అధికారుల విచారణలో తేలింది. దీంతో వాసాయివిరార్ మున్పిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకుబిల్డర్ నిటల్ గోపినాధ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ల్యాండ్ ఓనర్ మీద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
కేక్ కట్ చేసిన కొద్ది గంటలకే..
అ దుర్ఘటనలో 24 ఏళ్ల అరోహి జోయల్తో పాటు ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అరోహి భర్త ఓంకార్ జోయల్ శిథిలాల కింద ఉండవచ్చని భావిస్తున్నారు. ఆయన జాడ ఇంకా తెలియరాలేదు. చినారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని కేక్ కట్ చేసిన కొద్ది గంటలకు ఈ విషాదం చోటు చేసుకోవడం అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది. కేక్ కట్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాలకే ఆ కుటుంబంలో తల్లీ బిడ్డలు మృత్యువాత పడి తండ్రి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో ఈ సంఘటన అందరి హృదయాలను కలిచి వేసింది..
——————-