* విద్యార్థుల ఆవేదనను విని మీ ప్రభుత్వ తీరు తెలుసుకోండి
* 2 లక్షల ఉద్యోగాల్లో 10 శాతం నోటిఫికేషన్లు కూడా లేవ్
* టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా మార్చి చేతులు దులుపుకున్నారు
* కాంగ్రెస్ సర్కారుపై హరీశ్‌రావు ఫైర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahulgandhi) తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harishrao) ఓ లేఖ విడుదల చేశారు. అశోక్‌నగర్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి శోకాన్ని వినాలని సూచించారు. “మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్(Ashoknagar)లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? హైదరాబాద్(Hyderabad)కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి. మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్(Tgps)గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్(Job Calander) విడుదల చేస్తామని చెప్పారు, కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది.” అని పేర్కొన్నారు.
………………………………………………