* భారత్ – పాక్ సైనిక విన్యాసాలు
* పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా భారత్
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత్ – పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్వోసీ, ఆరేబియా సముద్ర జలాలు, గగనతలంలో ఇరు దేశాల సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. బలప్రదర్శనకు సిద్ధం అవుతున్నాయి. ఇరు దేశాలు నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేశాయి. భారత్(Bharath), పాకిస్థాన్ (Pakisthan) యుద్ధ నౌకలను మోహరించాయి. కరాచీ పోర్టులో 6, ఒర్మారా పోర్టులో 4 పాక్ యుద్ధనౌకలు చేరినట్లు తెలుస్తోంది. గుజరాత్ (Gujarath)పోరుబందర్ దగ్గర భారత్ యుద్ధ నౌకలు మోహరించాయి. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే పహల్గామ్ ప్రతీకార దాడి విషయంలో ఇప్పటికే సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఇచ్చినట్లు మోదీ ప్రకటించారు. ‘‘ఉగ్రవాదాన్ని అణిచివేయడం మా జాతీయ సంకల్పం’’ అని మోదీ (Modi) అన్నారు. భారత రక్షణ దళాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
…………………………………………..
