
* ఉద్రిక్తంగానే సరిహద్దుల్లో పరిస్థితులు
ఆకేరు న్యూస్, డెస్క్ : పాక్ దాడులను సమర్దవంతంగా తిప్పికొట్టామని కల్నల్ సోఫియా ఖురేషి వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ, విదేశాంగ శాఖలు సంయక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. భారత్ లోని 26 ప్రదేశాల్లో పాక్ దాడులకు తెగబడిందని వెల్లడించారు. ఈ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ భారత రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని అన్నారు. శ్రీనగర్, ఉధంపూర్, బటిండాలో పాక్ దాడులు జరుపుతోందని వెల్లడించారు. పలుచోట్ల పాఠశాలలు, వాయుసే ఆస్పత్రులపై కూడా దాడులు చేసిందన్నారు. వాటిని అన్నింటినీ తప్పికొట్టామన్నారు. బుజ్, బటిండాలోని ఎయిర్ స్టేషన్లపై పాక్ దాడి చేసిందన్నారు. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో క్షిపణులతో దాడులకు దిగిందన్నారు. నిన్న 26 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు వివరించారు. యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేస్తోందని వివరించారు. పాక్ మిస్సైల్స్ ను భారత్ సమర్దవంతంగా తిప్పికొట్టిందన్నారు. పాక్ ఎయిర్ బేస్ లను దెబ్బతీశామన్నారు. పాక్ దాడులు చేసిన ప్రతీచోటా భారత్ దీటుగా ప్రతిఘటించిందని వివరించారు. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు.
వింగ్ కమాండర్ ఒమికా సింగ్ మాట్లాడుతూ.. పాక్ డ్రోన్లు, లాంగ్ రన్ మిస్సైల్స్ ఉపయోగిస్తోందని, పటాన్ కోట్, ఉడంపూర్, బూజ్ ప్రాంతాలపై దాడులు చేసిందన్నారు. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టామన్నారు. భారత్ కేవలం పాకిస్తాన్ మిలటరీ స్థావరాలను టార్గెట్ చేస్తే, పాక్ పౌరుల స్థావరాలపై కూడా దాడి చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి దాడీ జరగలేదన్నారు. తెల్లవారుజామున 5 గంటల వరకు పాకిస్తాన్ డ్రోన్లతో ఉపయోగించిందని వెల్లడించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్పీ మాట్లాడుతూ పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. దాడులతో పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెంచుతోందన్నారు. పాక్ దాడులను సమర్దవంతంగా తప్పికొడుతున్నామన్నారు. పాక్ దాడుల్లో ఒక ఆర్మీ అధికారి చనిపోవడం విచారకరమన్నారు.
……………………………………………….