ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్ దాడులు పాల్పడుతోందని భారత్ ఆరోపించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌మెన్‌కు నోటీసు జారీ చేసింది. శనివారం తెల్లవారు జామున 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నిరకాల విమానాలకు గగనతలం మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ తన గగనతలాన్ని తెరిచి ఉంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని ఆరోపించింది. కరాచీ, లాహోర్ మధ్య విమానాలు తిరుగుతూన్నా.. ఎయిర్‌స్పేస్ మూసేశామని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఎల్వోసీ వెంట కాల్పులు జరుపుతోందని.. ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తూనే లేదంటూ అబద్ధాలను వల్లె వేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధ్వజమెత్తారు.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
