* ఎడారిలా మారిన ప్రసిద్ధ తటాకం
* టన్నుల కొద్దీ చేపలు దొరకడంతో మత్స్యకారులకు పండగ
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ లో ప్రముఖ జలాశయం భద్రకాళి చెరువు(Badrakhali Lake ) పూర్తిగా ఖాళీ అయింది. నిత్యం నిండుకుండలా కళకళ లాడే చెరువు ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. నీరంతా దిగువకు వదిలేయడంతో ఖాళీ అయింది. ఈ చెరువు వరంగల్( Warangal) నగర ప్రజల దాహార్తిని తీరుస్తోంది. ప్రస్తుతము సమ్మర్ వాటర్ స్టోరేజీ జలాశయంగా ఉపయోగపడుతుంది. చెరువు అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం 382 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చాలా భాగం కబ్జాకు గురైంది. మిగిలిన ఉన్న చెరువును పరిరక్షించేందుకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Mla Nayini Rajender Reddy ) చొరవ తీసుకొని ప్రక్షాళనకు ప్రయత్నం చేస్తున్నారు. చెరువులో పూడిక తీసి, శుద్ధి చేయాలని, బౌండరీస్ ఫిక్స్ చేయాలని భావించారు. కొత్త అందాలతో అందులో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా నవంబర్ 9వ తేది నుండి చెరువు నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాదాపు 8 రోజులు వ్యవధిలోనే చెరువు నీరంతా ఖాళీ అయింది. కాపువాడ(Kapuwada)ప్రాంతంలోని మత్తడికి గండి కొట్టిన అధికారులు ఆ నీటిని నాగారం చెరువులోకి మళ్లించారు. చెరువు నీరంతా ఖాళీ అవడంతో మత్స్యకారులు పండుగ చేసుకుంటున్నారు. టన్నుల కొద్దీ చేపలు లభ్యం కావడంతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
………………………………………………