Hanamkonda Attack CCTV Incident
* హనుమకొండ లో మరోదాడి
* సీసీటీవీల్లో రికార్డ్
ఆకేరు న్యూస్, వరంగల్ :
వరంగల్ నగర పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వేర్వేరు దాడి ఘటనలు నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఏనుమాముల మార్కెట్ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు అడుప మహేశ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ కేసులో పోలీసులు రౌడీషీటర్ పత్తి కుమార్, జన్ను మధుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* మరో దాడి
హనుమకొండ బాలసముద్రంలోని శ్రీనివాస కాలనీలో ఓ వ్యక్తిపై కర్రలు, రాళ్లతో దాడి జరిగిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. బాధిత కుటుంబ సభ్యులు గతంలోనే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో నగరంలో రౌడీయిజం, భూకబ్జాదారుల ఆగడాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
——
