
రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ చాంఫియన్ షిఫ్లో బంగారు పతకాన్ని సాధించిన వి.సువర్ణ ను అభినందిస్తున్న వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్, వరంగల్ : ఇటీవల రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ చాంఫియన్ షిఫ్లో (Shooting Championship) బంగారు పతకాన్ని సాధించిన మహిళా అసిస్టెంట్ సబ్`ఇన్స్స్పెక్టర్ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Ambar Kishor Jha) గురువారం అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Police Commissionerate) పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో మహిళా అసిస్టెంట్ సబ్`ఇన్స్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వి.సువర్ణ గత నెల 21వ తేది నుంచి 28 తారీఖు వరకు హైదరాబాద్లో సెంట్రల్ విశ్వవిద్యాలయములో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా ఓపెన్ షూటింగ్ చాంఫియన్ షిప్ పోటీల్లో 50 మీటర్ల రైఫిల్ ఫ్రోన్ మాస్టర్స్ విభాగంలో 579 పాయింట్లతో విజయం సాధించి బంగారు పతకాన్ని అందుకుంది. గత నెల 15 నుంచి 20 వరకు తమిళనాడులో నిర్వహించిన ఆల్ఇండియా పోలీస్ స్పెషల్ మహిళా షూటింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుపున సువర్ణ పాల్గోని ఐదవ స్థానంలో నిలిచింది. షూటింగ్ పోటీల్లో పతకం గెలుచుకున్న సువర్ణను వరంగల్ పోలీస్ పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు. క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు తప్పక ప్రోత్సహం అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో ఆర్.ఐ స్పర్జన్రాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్ గౌడ్ పాల్గోన్నారు.
—————————