* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరు న్యూస్ హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Ambar Kishor Jha) అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా వాగులు, చెరువుల్లో పెద్ద స్థాయిలో వరద నీరు వస్తుందడంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వరద నీరు ప్రవహించే వాగులు, చెరువులపై పోలీసులు అధికారులు దృష్టి పెట్టాలన్నారు. వాగుల్లో నీటి ప్రవాహంపై పోలీస్ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా ట్రై సిటీ తో పాటు, గ్రామాల్లో గతంలో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించాలన్నారు..ఈ వర్షాలకు కారణంగా నివాస ప్రాంతాలు ముంపుకు గురైయ్యే ప్రమాదం ఉన్నట్లయితే అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.
——————————————————