
* కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
* అధికారుల అదుపులో నాగమణి సహా ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్
ఆకేరున్యూస్, వరంగల్ : వరంగల్ మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.50వేలు లంచం తీసుకుంటూ జిల్లా అధికారిణి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ పట్టుబడ్డారు. ఓ సొసైటీకి చెందిన కార్యక్రమం విషయంలో లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. పథకం ప్రకారం వారు కార్యాలయంపై దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో తనిఖీలు కూడా నిర్వహించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
………………………………………………..