* ఇరువర్గాలతో మాట్లాడిన మహేశ్ గౌడ్
* మా మధ్య విభేదాలు లేవన్న రేవూరి
* వైరల్ అవుతున్న కొండా సురేఖ తీరు
ఆకేరు న్యూస్, వరంగల్ : పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ(Konda Surekha), ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) వర్గాల మధ్య ఫ్లెక్సీ పంచాయితీ టీపీసీసీకి చేరింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ (Tpcc Chief MaheSh Goud) ఇరువర్గాలతో మాట్లాడారు. పార్టీలో కలహాలు మంచిది కాదని హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ పెద్ద కుటుంబం అని, చిన్నచిన్న గొడవలు సర్వసాధారణం అని చెప్పారు. తామంతా అధిష్ఠానం డైరెక్షన్లోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని తెలిపారు. తమకు ప్రాంత అభివృద్ధి, ప్రజలే ముఖ్యం అని వెల్లడించారు.
ఎస్ఐ కుర్చీలో కూర్చుని..
ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) మరోసారి చర్చనీయాంశంగా మారారు. తమ కార్యకర్తల కోసం ఆటోలో గీసుకొండ స్టేషన్కు వెళ్లిన కొండా .. అరెస్టు చేసిన తమ అనుచరులను బయటకు పంపాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎస్ఐ కుర్చీలో కూర్చుని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. తమ కార్యకర్తలను విడిచి పెట్టేవరకు వెళ్లబోనని స్పష్టం చేశారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా స్టేషన్కు చేరుకొని మంత్రి సురేఖకు నచ్చజెప్పడంతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోయారు.
…………………………………….