
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* ఏషియన్ మాల్ లో భార్బరిక్ ప్రీమియర్ షో
ఆకేరు న్యూస్, హనుమకొండ : చలన చిత్రాల నిర్మాణానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అనువైన ప్రాంతమని మరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు, ఏషియన్ మాల్ జరిగిన బార్బరిక్ చిత్రం ప్రీమియర్ షో లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చలన చిత్ర రంగానికి ఎప్పుడూ అండగా నిలిచిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. సినిమా పరిశ్రమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దిల్ రాజు గారిని చైర్మన్ నియమించామని అన్నారు. హనుమకొండ వరంగల్ వేదికగా చిత్రాలను చిత్రీకరించేందుకు అనువైన ప్రదేశాలు ఉన్నాయని ఇక్కడి కళా సంపదను సినిమాల ద్వారా చాటి చెప్పి తెలుగు వైభవాన్ని ప్రపంచంలో చాటి చూపాలని కోరారు. స్థానిక శాసన సభ్యుడిగా సినిమా రంగంలో ఇక్కడ కావాల్సిన మౌలిక ఏర్పాట్లు తదితర అంశాలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.మోహన్ శ్రీ వాస్తవ దర్శకత్వంలో ఆడిదల విజయపాల్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన త్రివణదారి బార్బరిక్ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి EV శ్రీనివాస్ రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, యువజన నాయకులు తోట పవన్, నటీనటులు ఉదయభాను, సత్యం రాజేష్ మరియు చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………….