Warangal Joint Collector Sada Bainama Review
* సాదా బైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలి – జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి
ఆకేరు న్యూస్, రాయపర్తి :
వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా తిరుమలాయపల్లి, కొండూరు గ్రామాల్లో జరుగుతున్న ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం రాయపర్తి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, సాదా బైనామా దరఖాస్తుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు. అనంతరం సాదా బైనామా దరఖాస్తులను పరిశీలిస్తూ, పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను చట్ట నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని తహసిల్దార్‌ను, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎం శ్రీనివాస్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
