*తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కరపత్రం విడుదల
ఆకేరు న్యూస్, వరంగల్ : ఓ వైపు సంక్రాంతి సెలవులు మరో వైపు మేడారం జాతర వృత్తి రీత్యా వేరే ప్రదేశాల్లో నివాసం ఉంటున్న వారు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పరుగులు తీస్తారు. అయితే ఇటీవల కాలంలో దొంగతనాలు పెరుగుతున్నాయి. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. మరో వైపు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లలో ఉన్నవన్నీ దోచుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పండగల వేళ ఇంటికి తాళాలు వేసి ఇతర చోట్లకు వెళ్లే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరించారు. ఈ మేరకు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజల కోసం జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు.
* సెలవుల్లో బయటకు వెళ్లేప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ స్పెన్సర్లు ఏర్నాటు చేసుకోవాలి
* ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం కాని డిజిటల్ లాక్ సిస్టం కాని ఏర్పాటుచేసుకోవాలి
* బీరువా తాళాలు ఇంట్లో పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి
*ఇంట్లో ఉన్న నగలను బ్యాంక్ లాకర్ లో పెట్టి వెళ్లాలి లేదా వెంట తీసుకెళ్లాలి పక్కింటి వారికి ఇవ్వకూడదు
*వాహనాలను ఇంటి ఆవరణలో పార్క్ చేసి వెళ్లాలి..ద్విచక్ర వాహనాలను చైన్ తో తాళం వేసుకోవాలి బయట గేట్ కు తాళం వేయకూడదు
* నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్మెన్గా సెక్యూరిటీగా సర్వెంట్ గా నియమించుకోవాలి
* ఇంట్లో స్వీయ రక్షణ కోసం 15 రోజులు స్టోరేజ్ ఉంటే సిసి కెమరాలను ఏర్పాటు చేస్తుకోవాలి. ఎప్పటికప్పుడు మొబైల్ లో చూసుకోవచ్చు సెక్యూరిటీ సర్వే లైన్స్ కు సిసి కెమరాలు ఉపయోగపడతాయి
* ఊరికి వెళ్లే ముందు పక్కింటి వారికి పరిసరాలను గమనించమని చెప్పాలి. ఇంటికి తాళం వేసిన తరువాత తాళం కన్పించకుండా డోర్ కు కర్టెన్ వేసుకోవాలి ఇంట్్లో ఏదో ఒక రూంలో లైట్ వేసి ఉంచాలి
*సోషల్ మీడియాలో మీ లొకేషన్ ట్రావెల్ ప్లాన్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అప్డేట్ చేయకూడదు
* ఇంట్లో లేనప్పుడు పనిమనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ఇంటి ముందు న్యూస్ పేపర్స్, చెత్తా చెదారం పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడమని చెప్పాలి. వాటిని కూడా గమనించి దొంగలు చొరబడే అవకాశం ఉంది. గ్రామంలో కాని పరిసరాల్లో కాని ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే స్థానికి పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగాసమాచారం అందించాలి. డయల్ 100 కి కాల్ చేయండి
*ఇంటి తాళాలను పూల కుండీల వద్ద తలుపుల దగ్గర మ్యాట్స్ కింద ఉంచకూడదు
*ఇంట్లో పనిచేసే వారి వివరాలను పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి
పైన వివరించిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకోసం విడుదల చేశారు.

…………………………………………..

