హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి
* పెళ్ళి వేడుకలకు డీజేలు వాడితే చర్యలు తప్పవు
– హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్ , వరంగల్ : పెళ్ళి వేడుకల్లో డీజే సౌండ్స్ (DJ Sounds ) వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ( ACP Devendar Reddy ) తెలిపారు. అర్థ రాత్రి వేళల్లో డీ జే సౌండ్స్ తో చాలా గందరగోళంసృష్టిస్తున్నారని ప్రజలు ఫిర్యాదులు చేశారు. విద్యార్థులకు పరీక్షలు ఉండడం వల్ల చదువుకోలేక పోతున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఫిర్యాదు చేశారన్నారు. అదే విదంగా గుండె జబ్బు ఉన్న వాళ్ళు , వృద్ధులు ఈ డీజే శబ్ధాల వల్ల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. పెళ్ళి వేడుకు సంతోషంగా జరుపుకోవాలి.. ఇతరులకు ఇబ్బంది కలిగించే విదంగా ఉండకూడదని ఏసీపీ దేవేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా సూచనల మేరకు ఈచర్యలు తీసుకుంటున్నామన్నారు. వివాహ ఊరేగింపులు కూడా రాత్రి గం 10.30 ని.ల లోపు పూర్తి చేసుకోవాలని ఏసీపీ తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారికి సంబందించిన డీజేలను సీజ్ చేయడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని దేవేందర్ రెడ్డి హెచ్చరించారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
