Adapa Mahesh Murder Case
* జులైలో సంచలనం సృష్టించిన ఉదంతం
* వరంగల్‌లో ఘటన
ఆకేరు న్యూస్, వరంగల్ జిల్లా : వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకుడు అడప మహేశ్ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న జన్ను మధు మృతి చెందాడు. జులై 18న గీసుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోటిలింగాల ఆలయం సమీపంలో కాంగ్రెస్ నాయకుడు అడప మహేశ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహేశ్ మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న జన్ను మధు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మధు మృతి చెందినట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. మధు మృతికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉందని, ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
