– గ్లూకోస్ టాలరెన్స్, డైస్లిపిడెమియా, హైపర్యూరికేమియా
– శరీర బరువు , బ్లడ్ లిపిడ్లు, రక్తంలో గ్లూకోజ్ మరియు, యూరిక్ యాసిడ్ ల పెరుగుదల.
– చైనా BMC public health అధ్యయనంలో వెల్లడి.
– ప్రముఖ కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి ఈ అధ్యయనాన్ని X లో షేర్ చేశారు.
ఆకేరు న్యూస్, కమలాపూర్: సామాజిక మాధ్యమాల్లో రీల్స్, వీడియోలను చూడటం అనేది యువకులు,మధ్య వయస్కుల రోజువారీ జీవితంలో తెలియకుండానే అంతర్భాగం ఐపోయింది. అయితే నిద్రపోయే ముందు రీల్స్ చూడటానికి గడిపిన స్క్రీన్ సమయం వల్ల యువకులు, మధ్య వయస్కులలో ముఖ్యంగా అధిక రక్తపోటుకు దారితీస్తుందనీ ప్రముఖ కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి ఈ అధ్యయనాన్ని X లో షేర్ చేశారు. రీల్స్ కారణంగా సహానుభూత నాడీ వ్యవస్థ యాక్టివేట్ కావడంతో,శరీరంలో ప్రతిస్పందనగా రక్తపోటు పెరుగుతుందన్నారు.
ఏమిటి అధ్యయనం ?
చైనాలో BioMed Central జరిపిన ఈ అధ్యయనంలో 4318 మంది యువకులు మరియు మధ్య వయస్కులు ఉన్నారు. వారి నుంచి సేకరించిన డేటా ఆధారంగా, నిద్రవేళలో రీల్స్ లను వీక్షించడానికి గడిపిన స్క్రీన్ టైంల వల్ల వారి ఆరోగ్యంలో వచ్చే తేడాలను అనాలసిస్ చేసిన అనంతరం యువకులు, మధ్య వయస్కులు, నిద్రవేళలో చిన్న వీడియోలు, రీల్స్ ను చూడటంతో అధిక రక్తపోటుతో సంబంధం కలిగి ఉన్న అధిక బరువు లేదా ఊబకాయం, మధుమేహం లేదా బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్, డైస్లిపిడెమియా, హైపర్యూరికేమియా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అధ్యయనంలో వెళ్లడైంది. అధికంగా రీల్ చూడడం అనేది వ్యక్తిగతంగా స్త్రీ , పురుషుల్లో వారి వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తితో పాటు, ఆహారంలో తీసుకునే ఉప్పు మోతాదు వలన ఆయా ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అధ్యయనంలో వెల్లడైంది.
జీవనశైలిని మెరుగుపరుచుకోండిలా
నిద్రవేళలో రీల్స్ లను తగ్గించటం వల్ల , శరీర బరువు, బ్లడ్ లిపిడ్లు, రక్తంలో గ్లూకోజ్ మరియు, యూరిక్ యాసిడ్ స్థాయిలు,తో పాటు తక్కువ ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల ,మన జీవనశైలిని మెరుగు పర్చుకోవటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చనీ ఈ అధ్యాయనంలో వెల్లడైంది.
………………………………………….