* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: కష్టం ప్రస్తుతం జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా కృషి చేస్తూ తమ సత్తా చాటాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లోని బి ఆర్ ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క విచ్చేసి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలందరూ సమన్వయంతో పని చేయాలని కార్యకర్తలను కోరారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుయే లక్ష్యంగా ముందుకు సాగాలి అని, కార్యకర్తలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, సమన్వయంతో స్థానిక ఎన్నికల గెలుపు కానుకను ముఖ్యమంత్రి కి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలను గడప, గడపకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని కోరారు.అధికారంలోకి వచ్చాక చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిని ప్రజలకు చేరవేసి స్థానిక అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్, RTA డైరెక్టర్ వసంత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………
