
* మిగిలిన చోట్ల కాంగ్రెస్తో పనిచేస్తాం
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలుపుకుపోతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకు వెళ్తామన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేయడాన్ని తాను స్వాగతిస్తున్నామని తెలిపిన కూనంనేని.. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో అత్యంత దారుణంగా చంపేస్తున్నారని.. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అలాగే రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేసినా కూడా చెప్పుకోవడం లేదన్నారు. అయితే.. 2 లక్షల మేర రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొంత వైఫల్యం చెందిందన్నారు.
………………………………