
* జూనియర్ ఆర్టిస్ట్ రవిచంద్రన్ బెదిరింపు
ఆకేరు న్యూస్ డెస్క : తమిళ అగ్రనటుడు రాజ్యసభసభ్యుడు కమల్ హాసన్ (KAMAL HAASAN)ను చంపేస్తాం అంటూ జూనియర్ ఆర్టిస్ట్ రవిచంద్రన్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ అభిమానులు,మక్కల్ నీది మయ్యం నాయకులు రవిచంద్రన్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ విద్యతోనే మనిషి లో మార్ప వస్తుందని సనాతన ధర్మసిద్దాంతాలను బ్రేక్ చేయాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని కమల్ వ్యాఖ్యానించారు. కమల్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి, సనాతన వాదులు కమల్ వ్యాఖ్యలపు తీవ్రంగా ఖండించారు. ఈ నేపధ్యంలో జూనియర్ అర్టిస్ట్ రవిచంద్రన్( RAVICHANDRAN) మరింత ముందుకు వెళ్లి కమల్ హాసన్ ను చంపేస్తాఅంటూ వార్నింగ్ లు ఇచ్చాడు. రవి చంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవిచంద్రన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఎన్ఎం (MAKKAL NEEDI MAYYAM)నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కన్నడ భాషపై గతంలో కమల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపిన విషయం తెల్సిందే,, తాజాగా కమల్ మరోసారి వార్తల్లో కి ఎక్కాడు
…………………………………