
ఆకేరున్యూస్ డెస్క్: నటుడు సల్మాన్ ఖాన్‌కు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను చంపినందుకు గానూ సల్మాన్ ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెప్పాలని లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్‌కు సోమవారం ఈ సందేశం వచ్చినట్లు పోలీసులు వెల్లడిరచారు. ‘సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదంటే.. రూ. 5 కోట్లు చెల్లించాలి. ఏది చేయకపోయినా.. మేము సల్మాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడిరచారు.
………………………………………..