– కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ
– 135 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రణవ్..
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీనీ ఆలస్యం చేయమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ అన్నారు.అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన నియోజకవర్గం లోని పేదవారికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన చెక్కులను ప్రణవ్ శనివారం హుజురాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు అందిస్తున్నామని, కాంగ్రెస్ అంటే పేదల పార్టీ అని అన్నారు.తీసుకున్న చెక్కులను వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ప్రణవ్ సూచించారు.హుజరాబాద్ పట్టణము, మండలం, జమ్మికుంట పట్టణం ,మండలం, వీణవంక మండలం, కమలాపూర్ మండలాలలో రూ.47,62,000 విలువ గల 135 చెక్కులను లబ్ధిదారులకు ప్రణవ్ అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులకు,పార్టీ ఇంచార్జీ ప్రణవ్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ,మండల,జమ్మికుంట పట్టణ,మండల,వీణవంక,కమలాపూర్ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
…………………………………………….
