
* ఫామ్ హౌస్‌లను కాపాడుకునేందుకే పేదలను రెచ్చగొడుతున్రు
* ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుకుంటున్రు
* సోషల్‌మీడియాతో అధికారంలోకి రారు.. చర్లపల్లి జైలుకు పోతారు
* రండి.. సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు ఆహ్వానం
* విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం..
* మూసీ నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇద్దాం..
* ఎవరైనా రెచ్చగొడితే వినకండి…
* బఫర్ జోన్లో ఇళ్లు ఉన్న వారికి కూడా ప్రత్యామ్నాయం చూపుతాం
* కాకా జయంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూసీ నిర్వాసితులను అనాథలను చేయబోమని, అన్ని రకాలుగానూ ఆదుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ (Telangana CM Revanth)తెలిపారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకునేందుకే పేదలను రెచ్చగొడుతున్రని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి జి. వెంకటస్వామి(Venkataswamy) జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. సోషల్‌మీడియా(Social Media)తో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, కానీ చర్లపల్లి జైలుకు పోతారని హెచ్చరించారు. ఎవరైనా రెచ్చగొడితే వినకండని, బఫర్ జోన్లో ఇళ్లు ఉన్న వారికి కూడా ప్రత్యామ్నాయం చూపుతామని రేవంత్ హామీనిచ్చారు. మూసీ నిర్వాసితుల కోసం 10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఫామ్ హౌస్‌లు కాపాడుకునేందుకే..
వారి ఫామ్ హౌస్(Farm House)లు కాపాడుకునేందుకే పేదలను రెచ్చగొడతున్నారని, పేదల ప్రయోజనాలు కోసం కాదని సీఎం తెలిపారు. వాళ్లు మాత్రం 25 ఎకరాలు, వందల ఎకరాల్లో జమీందారులుగా బతకాలా.. హైదరాబాద్‌లో బతకడానికి వచ్చిన వాళ్లు మూసీ దోమలకు బలి కావాలా అని ప్రశ్నించాచారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని, మూసీని కూడా మూసేస్తే హైదరాబాద్ వదరలను ఎలా తట్టుకుంటుందని అన్నారు. హైదరాబాద్(Hyderabad)లో గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయిందని, గత వేసవిలో నీళ్లు లేక బెంగళూరు(Bengalure) అల్లాడిపోయిందని గుర్తు చేశారు.
500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా..
బీఆర్ఎస్(Brs) ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయని, 500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. మీ ఆస్తులు ఎలా పెరిగాయని అన్నారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్(Kcr), కేటీఆర్(Ktr), 2005 నుంచి హరీశ్ రావు(Harsihrao) ఎన్నికల అఫిడవిట్లు పరిశీలిస్తే ఆస్తులు ఎలా పెరిగాయో అర్థం అవుతుందన్నారు. అదంతా ప్రజల సొమ్మే కదా అని ఆరోపించారు.
విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం..
రండి.. సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలను సీఎం రేవంత్ ఆహ్వానించారు. విపక్షాల సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని ప్రకటించారు. కాకా స్ఫూర్తితో మూసీ నిర్వాసితులకు మంచి జీవితాన్ని ఇద్దామని పిలుపునిచ్చారు. అంబర్‌పేటలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడ పేదలకు ఇళ్లు కడదామని, వచ్చి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రత్యామ్నాయం చూపమంటే చెప్పకుండా, అవ్వాకులు చవ్వాకులు పేలుతున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్(Gujarath)లో సబర్మతీ నది అభివృద్ధికి, ఎంతో మంది నిర్వాసితులయ్యారని, సగం మందికి కూడా మోడీ(Modi) పరిహారం ఇవ్వలేదని ఈటల రాజేందర్(Etala Rajender) గుర్తించాలన్నారు.
……………………………………..