
* భూప్రకంపనలపై ప్రధాని మోడీ ఆరా
ఆకేరున్యూస్, ఢిల్లీ: భారీ భూప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహా చర్యలు చేపట్టారు. కాగా.. భూప్రకంపనలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ఆందోళన వ్యక్తం చేసి భారతదేశం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్‌లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించడంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు పరుగులు తీశారు.
……………………………