* కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టొద్దు
* ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడ్డామని.. కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి కష్టపడితే నేడు నోటికాడ పళ్లెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా.. అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నామన్నారు.
……………………………………………….