ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రథసప్తమి కావడంతో ఈరోజు ఆలయాల్లో ఆధాత్మిక శోభ సంతరించుకుంది. తెలుగు ప్రజలు ఇళ్లలోనూ సూర్యభగవానుడికి పూజలు నిర్వహించారు. అయితే.. ఇదే సందర్భంలో వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. శాటిలైట్ అంచనాలను చూస్తే ఏపీ, తెలంగాణపై రోజంతా చిన్నపాటి మేఘాలు వస్తూపోతుంటాయి. కానీ అవి చల్లదనాన్ని ఇవ్వలేవు. వాటిని మించిన వేడి భూమికి తాకుతోంది. సూర్యకిరణాలు డైరెక్టుగా తెలుగు రాష్ట్రాలపై పడుతున్నాయి.
అందులోనూ నేడు రథసప్తమి (Rathasapthami) కావడంతో వేడి ఉంటుంది, కాగా బంగాళాఖాతంలో గంటకు 25కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 13కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 12కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాలులన్నీ తుపాన్లు ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వైపు వెళ్లిపోతున్నాయి. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో గాలివేగం చాలా తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఏపీ(AP)లో నేడు 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణ(Telangana)లో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని పేర్కొంది.
………………………………………………