* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాణ్యత లేనిది కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో కాదని, బీజేపీ(bjp), కాంగ్రెస్(congress) చేస్తున్న రాజకీయాల్లో నాణ్యత లేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అశాస్త్రీయ నివేదికలతో తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్డీఎస్ ఏ నివేదిక రాజకీయ ఎజెండాతో కూడుకూన్నదని విమర్శించారు. ఎన్డీ ఎస్ఏ నివేదికను ఎన్డీఏ (nda)నివేదిక అనడంలో తప్పులేదన్నారు. శాస్త్రీయ వివరాలు లేకుండా కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం తెలంగాణకు జీవధార అని, కేసీఆర్(kcr) ఒక దార్శనికుడని అన్నారు.
………………………………….

