* ఆయన ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు, ప్రముఖులు ఆయనను స్మరించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (NARENDRA MODI) సైతం ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)నేతృత్వంలో ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి(NDA coalition alliance) ప్రభుత్వం, ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి, ఆయన దార్శనికతలో ప్రయాణించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
