* ఎక్స్ వేదికగా సర్కారుపై కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ నేతలపై కేసులు, పోలీసుల తీరుపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(ktr) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ (ఎక్స్) వేదికగా ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ(Acp) పరార్… సీఐ (Ci)పారిపోతారు… ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా? పట్టుకొని నిలదీస్తే… అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం? మీ అక్రమాలను ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారు. కానీ ఇవేవీ ప్రజా గొంతుకులైన మాకు అడ్డం కావు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా… ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం.. జై తెలంగాణ(Jai Telangana).. అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.
……………………………………….