– ఆ ముగ్గురిలో ఒకరు..
ఆకేరు న్యూస్, విజయవాడ :
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయనను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తప్పించింది. అనంతరం ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్త అనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను ఈసీకి పంపించినట్టు తెలిసింది. సాయంత్రంలోగా ఏపీకి కొత్త డీజీపీని నియమించే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంచార్జీ డీజీపీగా శంఖ్రత బాగ్చీ పదవిలో ఉంటారు. శంఖబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు.
—————————