* అరెస్ట్ చేసుకో రేవంత్ .. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో
* ముఖ్యమంత్రి పై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CHIEF MINISTER REVANTHREDDY)పై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పరుషపదాలతో ఎక్స్(X) వేదికగా విరుచుకుపడ్డారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ తీవ్రంగా స్పందించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? .. నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో(ARREST ME) రేవంత్ రెడ్డి .. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో.. అంటూ సవాల్ విసిరారు. లగచర్ల(LAGACHARLA) దాడి ఘటన కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కేటీఆర్ పేరును సైతం ప్రస్తావించడం సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉద్దేశంలో కేటీఆర్‌తో బీఆర్ఎస్(BRS) నేతల ఆదేశాలు ఉన్నాయని.. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? ఎక్స్ లో ధ్వజమెత్తారు. నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అని మండిపడ్డారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? అంటూ ప్రశ్నించారు.
అర్ధరాత్రి నుంచీ హైటెన్షన్
లగచర్ల ఘటన నేపథ్యంలో కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచీ అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం వరకూ కేటీఆర్ ఇంటి దగ్గరే నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే కేటీఆర్ అరెస్ట్(KTR ARREST) ఖాయమన్న వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు. కార్యకర్తకు తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు.
…………………………………………………