* ఓటేసిన రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Election Poling) ఉత్సాహంగా కొనసాగుతోంది. ఢిల్లీ నిర్మాణ్‌భవన్‌లో దేశ ప్రధమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఉదయమే ఓటుల వేశారు. ఢిల్లీ సీఎం అతిశీ కాల్ కాజీలో, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvindh Kejriwal) ఓటు వేశారు. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఆయన సతీమణీ సీమ, ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా రాజ్‌నివాస్ మార్గ్‌లో ఓటు వేశారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 699 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 20 శాతం పోలింగ్ నమోదైంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేత్రుత్వంలోని అప్ (AAP) ఉవ్విళ్లూరుతుండగా 25ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ (BJP)భావిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ కూడా గెలవని కాంగ్రెస్(CONGRESS)..ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఇక్కడ గెలిచేది ఎవరు అనేది ఉత్కంఠ ఏర్పడింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
……………………………………………