
– వాతావరణం బాగా లేనందున వర్షం పడితే జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ?
– వెంటనే కొనుగోలు చేపట్టాలి లేకపోతే రైతులతో కలసి ధర్నా చేస్తా
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఐకెపి కేంద్రాలలో రైతులకు గన్నీ సంచులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోళ్ళు జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులోని కొనుగోలు కేంద్రంను శనివారం సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులందరికీ గన్ని సంచులు తప్పకుండా ఇవ్వాలని చెప్పినప్పటికీ, ఇవ్వకుండా అధికారులు కమీషన్ల కోసం బ్రోకర్లను అడ్డుగా పెట్టుకొని రైతులను నష్టపరుస్తున్నారని అన్నారు. గన్ని సంచులు ఇవ్వకపోవడంతో గూడూరు ఐకెపి కేంద్రంలో వడ్ల నిల్వలు పేరుకు పోతున్నాయని, ప్రస్తుతం వాతావరణం బాగా లేనందున వర్షం పడితే ఎలా అని రైతులు అల్లాడిపోతున్నారని కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ట్రాక్టర్ ద్వారా వడ్ల సరఫరా చేసుకొని ఇవ్వకుండా లారీల ద్వారా వడ్ల సరఫరా చేస్తే రైతులు నష్టపోతారని అన్నారు. ఐకెపి కేంద్రం నుంచే సివిల్ సప్లై కమిషనర్ కి, హన్మకొండ జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేస్తే వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నామని అంటున్నారనీ, త్వరగా ధాన్యం కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.ఉప్పల్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం ఆరబోయడానికి కచ్చితంగా ఐకేపీ సెంటర్ కి రావాలని అంటున్నారన్నారు.అధికారులందరూ వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు ప్రారంభించాలని, లేని పక్షంలో రైతులందరి తో కలిసి ధర్నా చేస్తానని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
………………………………………………..