* సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) ఎందుకు అంగీకరించట్లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రశ్నించారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని వెల్లడించారు. ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా హైదరాబాద్ తెలంగాణ భవన్(Telanganabhavan)లో తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలకేమో విగ్రహాలు.. మగవాళ్లకేమో వరాలా అని ప్రశ్నించారు. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయని, పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదని తెలిపారు. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మ(bathukamma)ను తొలగించడం దారుణమని, తెలంగాణ ప్రత్యేకతే బతుకమ్మ అని చెప్పారు. 9 మంది తెలంగాణ కవులు, కళాకారులకు స్థలాలు, డబ్బులిస్తామన్నరు. గుర్తింపునకు మల్లు స్వరాజ్యం, విమలక్క, సంధ్య పనికిరారా అని ప్రశ్నించారు. సీఎం నోట నుంచి ఎరుకల నాంచారమ్మ, బీడీ కార్మికుల మహిళల పేర్లే రాలేదని విమర్శించారు.
…………………………….