* నిర్మాణం పూర్తయ్యాక టీటీడీ లేదా ఎండోమెంట్కి మేమే అప్పగిస్తాము
* ఇది ఒక్క వ్యక్తి యొక్క ఆస్తి కాదు,ప్రజల ఆస్తి
* మేము భక్తునిగా భగవంతుడి సేవకులం మాత్రమే.
* భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
ఆకేరున్యూస్, భూపాలపల్లి: మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పై రాజకీయం ఎందుకు చేస్తున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ లీడర్ గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రశ్నించారు. గురువారం దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ…మంజూరు నగర్ నందు లోక కళ్యాణం కొరకు, భక్తుల దర్శనార్థం సంవత్సర కాలంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి, మూల విరాట్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రతిస్టించుకున్నామని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో తిరుమల తిరుపతి లో స్వామి వారికి జరుగుతున్న కైకార్యాలను ఏ లోటూ లేకుండా ప్రతి రోజూ ఇక్కడి దేవాలయంలో సైతం నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆలయంలో రాజ గోపురం, ఉత్తర ద్వారం, యాగశాల,చుట్టూ ప్రహరీ గోడ, పాకశాల నిర్మాణం పనులు చేయాల్సి ఉందని,ఇప్పటికే కొంత మెటీరియల్ కూడా వచ్చిందని పేర్కొన్నారు. వేరే ఆలయం దగ్గర నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి ఆలయ నిర్మాణ శిల్పులు అక్కడికి వెళ్ళడం జరిగిందని,మళ్ళీ సంక్రాంతి వరకు ఇక్కడ మిగిలిన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు కొంచెం సమయం పడుతుందన్నారు.
ఈ ఆలయాన్ని ఎండోమెంట్ కు అప్పగించాలని స్థానిక శాసనసభ్యులు సదరు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసిందని, అయితే ఆలయానికి సంబంధించి కొన్ని పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పనులు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందని అన్నారు. ఒకవేల కుదరకపోతే ఎండోమెంట్ కే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికారమనేది శాశ్వతం కాదని దేవుని ఆశీర్వాదం, ప్రజల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. ఆలయాన్ని తను కమిట్మెంట్తో కట్టినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఆలయం పూర్తి అయ్యేంత వరకు కొంత సమయం ఇవ్వాలని గుడికి సంబంధించి తన వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగిస్తామని అనుకుంటే వారి విచక్షణకు వదిలేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………