* సీిఎం తీరుపై మండిపడ్డ హరీష్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: సినిమా వాళ్లను భయపెట్టి సీఎం మంచి చేసుకోకూడదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందన్నారు. గురుకులాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను సీఎం పరామర్శించలేదని.. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే.. అందుకు కారణమైన సీఎం తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం అందరికీ సమానమన్న సీఎం.. వాళ్ల తమ్ముడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను గురువారం భారాస నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నవీన్ రావు తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కిమ్స్ డాక్టర్లు చెప్పారని.. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
