
* భార్యభర్తలకు వేర్వేరుగా వివాహేతర సంబంధాలు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(Kukatpally housing board)లో దారుణం చోటుచేసుకుంది. భర్తను చంపి భార్య పూడ్చిపెట్టింది. భర్తపై విరక్తితో ఈ ఘాతుకానికి పాల్పడింది. 15 ఏళ్లుగా భార్యాభర్తలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య, భర్తకు వేర్వేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్యభర్తలు కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. భర్త వేధింపులు భరించలేక చెల్లెలు భర్త సహాయంతో అతడిని చంపేసింది. భర్త సాయిలును కరెంట్ షాక్తో చంపి పూడ్చిపెట్టింది. అనంతరం ఆమె పరారైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………….