
* సుఫారీ గ్యాంగ్‌కు భార్య ఆఫర్
* హోలీకి ముందే మర్డర్
* పోలీస్‌ల అదుపులో నిందితులు
ఆకేరున్యూస్, నర్సంపేట: అగ్నిసాక్షిగా తన మెడలో తాళి కట్టిన భర్తనే చంపేందుకు భార్య సుఫారీ ఇచ్చిన సంఘటన నర్సంపేటలో చర్చనీయాంశాంగా మారింది. హన్మకొండ పట్టణం లోని బట్టుపల్లి వద్ద ప్రేమించిన భర్తనే సుఫారీ గ్యాంగ్‌తో చంపించిన సంఘటన మరువకముందే మరో సంఘటన జరుగడం సంచలనం రికేత్తింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గిరిజన యువకుడికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.హైదరాబాద్ లో ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు లో పివో గా విధులు నిర్వహించడం జరుగుతుంది. భార్య తో హైదరాబాద్ లో కాపురం పెట్టిన యువకుడికి తరచు ఇంట్లో తను లేని సమయంలో ఎవరితో మాట్లాడడం చూశాడు.ఎవరని భార్య ను అడిగినా సరైన సమాధానం రాలేదు. రెండు నెలల క్రితం ఆకుల తండా లో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించడం జరిగింది. ఐనా భార్య లో మార్పు రాలేదు. దీంతో భర్త ఫై కోపం పెంచుకున్న భార్య తొర్రూరు, రాయపర్తి కి చెందిన సుఫారీ గ్యాంగ్ తో భర్త ను చంపేందుకు డీల్ కుదుర్చుకుంది. 10 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన భార్య అడ్వాన్స్ గా 3 లక్షలు చెల్లించింది. హత్య చేసిన అనంతరం మిగతా 7 లక్షలు చెల్లించాలని, హోలీ లోపు భర్త ను చంపేస్తామని సుఫారీ గ్యాంగ్ తెలిపారు. ఈ డీల్ విషయం గ్యాంగ్ లోని ఒక వ్యక్తి భర్త కు ఫోన్ లో విషయం లీక్ చేశాడు. బయపడిన భర్త నర్సంపేట పోలీస్ లకు పిర్యాదు చేశాడు. పిర్యాదు స్వీకరించిన పోలీస్ లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
………………………………