* కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని వినతి
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా, కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ను కోరారు. ఈ మేరకు హైదరాబాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల భద్రత దృష్ట్యా శాయంపేట, వడ్డేపల్లి పరిధిలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేయూసీ(కాకతీయ యూనివర్సిటీ సర్కిల్) పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకు సంబదించి స్థానిక శాసన సభ్యుడిగా ప్రజా అవసరాల దృష్ట్యా శాయంపేట, వడ్డేపల్లి పరిధిలో పోలీస్ స్టేషన్, కేయూసీ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తన లేఖలో పేర్కొన్నారు.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
