* కవిత కన్నీళ్లకు బీఆర్ ఎస్ మహిళా నేతలు సమాధానం చెప్పాలి
* జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీతక్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తోబుట్టును ఉసురుపెట్టినోళ్లు అభివృద్ధి చేస్తారా? ఏం చేస్తారో ఆలోచించుకోవాలని కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి సీతక్క (MINISTER SEETHAKKA) విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో మంగళవారం ఆమె ప్రచారం చేశారు. కాంగ్రెస్ (CONGRESS) ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కవిత కన్నీళ్లకు బీఆర్ఎస్ (BRS) మహిళా నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. ఉపఎన్నికల సందర్భంగా బోరబండ డివిజన్ బలహీనవర్గాల కాలనీ అన్నానగర్, పెద్దమ్మ నగర్ బస్తీలలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అభివృద్థి, సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలు పంచుతూ మంగళవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిేస్త జూబ్లీహిల్స్ నియోజకవర్గం జెట్ వేగంతో అభివృద్థి సాధిస్తుందని చెప్పారు.
……………………………………….
