* మహిళా ఆత్మహత్య
* పిల్లలను జాగ్రత్తగా చూసుకోడంటూ లేటర్
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : మానసిక ఇబ్బందులతో కొందరు చనిపోతుంటారు. ఆరోగ్య సమస్యలతో మరికొందరు మరణిస్తారు. ఇలా రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు విన్నాం. ఇందుకు భిన్నంగా తాజాగా జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఆరోగ్య సమస్యలు లేకున్నా.. ఆర్థిక సమస్యలు.. జీవితంపై విరక్తి వంటి సమస్యలు లేకపోయినా.. ఓ మహిళా చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారిగా షాక్ కు గురి చేస్తోంది. సంగారెడ్డి జిల్లాలో చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో నివాసం ఉండే మనీషా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చీమల ఫోబియాతో తాను చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్ రాసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జనం ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశారు.
………………………………………….
