
ఆకేరు న్యూస్, జనగామ: కార్మిక చట్టాల రూపకల్పనకు నిరసనగా జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తో సకలం బంద్ అయ్యాయి. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్ తెచ్చారని అగ్రహిస్తు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. జనగామ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో సమ్మె జరిగింది. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలు చేసే విధానాలను అవలంబిస్తుందని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల హక్కుల ను కాల రాస్తుందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ లు అమలు అయితే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతుందన్నారు. అలాగే సమ్మె చేసే హక్కు లేకుండా పని గంటల పెంపు కార్మికులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మికులు ఐక్యంగా పోరాటం నిర్వహించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికులపై ఉద్యమంపై దాడి చేస్తుందని మండిపడ్డారు. ఒకవైపున ధరలు ఆకాశాన్ని అందుతున్నా, మరోవైపున కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తునాయిని అన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్, ఆశ వర్కర్, గ్రామపంచాయతీ వర్కర్స్, హమాలి వర్కర్, తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్, వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
…………………………………………………