* విజయవాడలో మహిళ దారుణ హత్య
* భార్యభర్తల మధ్య మనస్పర్థలే కారణం
ఆకేరు న్యూస్, విజయవాడ : విజయవాడలో దారుణం జరిగింది. విజయ టాకీస్ సెంటర్లో నడిరోడ్డుపై భార్యను భర్తే కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఆమె పని చేస్తున్న ఆస్పత్రి గేటు వద్దే కాపుకాసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ (Vijayawada) విన్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి, ఆమె భర్త మధ్య మనస్పర్థలు ఉన్నాయి. కొంత కాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు. ఆమెపై కోపం పెంచుకున్న భర్త ఆమె పని చేస్తున్న ఆస్పత్రి గేటు వద్దే దారుణంగా పొడిచి చంపేశాడు(Murder). స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడించున్నారు.
