
* హనుమకొండ జిల్లాలో విషాదం..
ఆకేరున్యూస్, కమలాపూర్: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ మృతి చెందింది. కమలాపూర్ (KAMALAPUR) మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత (KAVITHA) (36) జ్వరంతో బాధపడుతుండడంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం (MGM) హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యం చేయించుకుని తిరిగి స్వగ్రామానికి భర్త కుమారస్వామి(KUMARAWAMY) తో ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. గూడూరు గ్రామం వద్దకు రాగానే చెమటలు పట్టి స్పృహా కోల్పోయింది. నిద్రపోయి ఉండవచ్చనుకున్న భర్త వంగపల్లి రావడంతో కిందకు దిగేందుకు లేపడంతో లేవలేదు. బస్సులో కూర్చున్న సీటులోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
……………………………………..