
* పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది
* రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్,హనుమకొండ : ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి సిబ్బంది బాధ్యతగా పని చేస్తూ ప్రజలలో ఒకరిగా ఉండాలి రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జోన్ పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ పోలీస్ అధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘి కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు.
పారదర్శకంగా పనిచేయాలి
పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలి అని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. బాగా పని చేసే సిబ్బందికి రివార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయి అని తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు స్పందించాలసిన బాధ్యత అందరిపై ఉంది అని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు.చివరగా పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.
…………………………………………………